సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఐజీ త్రిపాఠి

81చూసినవారు
నరసరావుపేట సమీపంలోని జేఎన్టీయూలో ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ జరగనుంది. ఈ ఏర్పాట్లను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ శ్రీనివాసరావుకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్