పరిశ్రమలలో "0" శాతం ప్రాణ నష్టం జరుగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని యస్. ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కార్మిక శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.