అమరావతి మండల కేంద్రంలో వరద బాధితులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆహార పొట్లాలు అందజేశారు. భాష్యం ప్రవీణ్ సూచన మేరకు విజేత సూపర్ మార్కెట్ గుంటూరు వారి సౌజన్యంతో ఆహార పొట్లాలు అందజేశారు. స్థానిక టీడీపీ నాయకులు జానీ పాల్గొని వరద బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు.