పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులు ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేశారు.విద్యార్థులు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం,క్రీడలను అభ్యాసం చేసి ఆరోగ్యంగా,దృడంగా ఉండవచ్చు అని పీడి ఎన్.అరుణశ్రీ అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం ఎ.శ్రీనివాస రెడ్డి,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.