పల్నాడు జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడిలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు కూలి శెట్టి నారాయణ (35) మరణించినట్లు బంధువులు తెలిపారు. పొలంలో పత్తి తీయడానికి వెళ్లి హఠాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ ఘటన జరిగింది.