సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.