అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామానికి చెందిన అద్దంకి బ్రహ్మయ్య (35) కౌలుకు పొలం తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. పంటలు సక్రమంగా పండక, పండిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూశాడు.