బొబ్బిలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్నటువంటి నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని భారతకమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలి పట్టణం బలిజిపేట రోడ్డులో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.