బొబ్బిలి: కోర్ట్ ఫీస్ స్టాంపులు అందుబాటులోకి తేవాలి

61చూసినవారు
బొబ్బిలి: కోర్ట్ ఫీస్ స్టాంపులు అందుబాటులోకి తేవాలి
బొబ్బిలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో గత రెండు నెలల నుండి కోర్ట్ ఫీస్ స్టాంపులు లభ్యం కావడం లేదని భారత న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు కండాపు ప్రసాదరావు అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయాలని సోమవారం పత్రికా ప్రకటనలో కోరారు. సబ్ రిజిస్టర్ కి పలుమార్లు తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కావున వెంటనే కోర్టు ఫీస్ స్టాంపులు ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్