గత వైసీపీ పాలనలో అనేక సార్లు కరెంటు రేట్లు పెంచి ప్రజలను దోచుకుందని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీనివాసరావు మంగళవారం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ రేట్లు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్మోటర్లు అదానీ కంపెనీవి కాబట్టి యుద్ధప్రాతిపదికన మీటర్లు బిగించడానికి సిద్ధమవుతుందని, ఇది చాలా అన్యాయం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.