విశాఖ డెయిరీ పాడి రైతులకు తగ్గించిన పాల సేకరణ ధరను పెంచాలని పాల రైతుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రజానీకం పశువుల పోషణతో జీవనోపాధిని, పాడి రైతులకు విశాఖ డెయిరీ తీరని నష్టాలను మిగులుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.