బొబ్బిలి పట్టణంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్రావు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. పట్టణంలో 27 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, గాలి, వర్షాలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు.