చీపురుపల్లి: ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా

52చూసినవారు
చీపురుపల్లి: ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా
గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీరు బురదమయంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన కుళాయిల ద్వారా మంచినీరు సరఫరాను నిలిపివేశారు. అనంతరం ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేశారు. గ్రామంలో మంచినీటి పైపుల లీకేజీలను సత్వరమే అరికట్టి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్