ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలను మానుకోవాలని మాజీ సీఎం జగన్ అన్నారు. గురువారం గుర్ల మండలంలో డయారియాతో చికిత్స పొందుతున్న రోగులను అలాగే డయేరియాతో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో మదనపల్లి కలెక్టరేట్లో ఫైల్స్ తగలబడ్డాయనే నెపంతో హెలికాప్టర్లలో మంత్రులను పంపించారని, డయెరియాతో ఇక్కడ 14 మంది చనిపోతే కనీసం ఒక్క మంత్రిని కూడా పరిస్థితి పరిశీలించేందుకు పంపించలేదని ఎద్దేవా చేశారు.