గుర్ల: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

73చూసినవారు
గుర్ల: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేసుకోవాలని గుర్ల ఎస్సై నారాయణరావు కోరారు. బుధవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంధాలయాలను విద్యార్థులు వినియోగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. గ్రంథాలయంలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్