తమ డిమాండ్లు పరిష్కరించాలని మెరకముడిదాం ఎంపీపీ తాడ్డి కృష్ణ వేణికి గార్భం, మెరకముడిదాం ప్రాథమిక వైద్య కేంద్రాల 104 సిబ్బంది వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాలా కష్టం అవుతుందని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా నిర్వహించాలని అన్నారు.