గంజాయి వినియోగం, అమ్మకాలు చట్ట రీత్యా నేరమని బొండపల్లి ఎస్సై యు. మహేష్ అన్నారు. సైబర్ నేరాలు పట్ల ఆయన ఆదివారం రాత్రి బొండపల్లిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్లో వచ్చిన ఓటీపీ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికల రూపొందించుకోవాలని తెలిపారు.