దత్తిరాజేరు మండలం పెదమానాపురం నుండి అలమండ సంతకు తరలిస్తున్న మూడు కంటైనర్ లారీలలో 96 పశువులను సబ్ ఇన్స్పెక్టర్ జయంతి శనివారం అర్ధరాత్రి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఆదివారం తెలిపారు. పశువులను హింసించే విధంగా తరలించడం చట్టవిరుద్ధం అని ఆమె పేర్కొన్నారు. పశువుల రక్షణ లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.