పారిశుద్ధ్య కార్యక్రమాలపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం గజపతినగరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు క్లోరినేషన్ చేసిన మంచినీళ్లు సరఫరా చేయాలని కోరారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఆసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీడీవో కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.