ఈ నెల 20 నుంచి కేరళలో జరగనున్న 27వ జాతీయ స్థాయి సపక్ తక్రా సబ్ జూనియర్ బాలికల పోటీలకు గంట్యాడ KGBV పాఠశాలలో చదువుతున్న కుమ్మరి అశ్విని, గండిమాని పవిత్ర ఎంపికయ్యారు. విద్యార్థులను ఒలంపిక్ అద్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, వేణుగోపాలరావు, సపక్ తక్రా సెక్రటరీ రాజేశ్, తదితరులు బుధవారం అభినందించారు. పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.