ఉత్తమ వసతి గృహం సంక్షేమ అధికారిణిగా ఎం. గౌరి అవార్డును అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పోలీస్ బేరక్స్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గజపతినగరంలోని ఎస్సీ బాలికల వసతుగృహం సంక్షేమ అధికారిణి ఎం. గౌరి ఉత్తమసేవలకు రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మాత్యులు కొండపల్లి శ్రీనివాస్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు లభించడంపట్ల గౌరి సంతోషం వ్యక్తం చేశారు.