మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో ఉన్న సచివాలయాన్ని ఎంపీడీవో భానుమూర్తి శుక్రవారం సందర్శించి సచివాలయం రికార్డులను పరిశీలించారు. సచివాలయం సిబ్బంది హాజరు పనితీరు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి నిరంతరం పాటు పడే విధంగా విధులు నిర్వహించాలని కోరారు.