దంతాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి

85చూసినవారు
దంతాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కురుపాం సీహెచ్సీ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ సుకృత అన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా గురువారం కురుపాం సీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దంతాలు, చిగుళ్లకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న దంత వైద్యులను సంప్రదించాలని, దంత సంరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శోభారాణి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్