జిల్లాలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్ నిశాంత్ కుమార్

1106చూసినవారు
జిల్లాలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్ నిశాంత్ కుమార్
మన్యం జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. కౌంటింగ్ అనంతరం పరిస్థితుల రీత్యా కొనసాగింపుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రం వద్ద 158 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లు నిరంతర నిఘాలో ఉంటాయని అన్నారు. ఇతరులు డ్రోన్లు, ఎగిరే పరికరాలు ఆ ప్రాంతంలో ఎగరవేయకుండా నో ఫ్లై జోన్ గా ప్రకటించామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్