కొమరాడ మండలం మార్కొండపుట్టిలో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అధికారులు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆనారోగ్య పరమైన సమస్యలు ఏర్పడితే పరిష్కారానికి ఆశా వర్కర్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఓటింగ్లో గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.