సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

54చూసినవారు
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
నెల్లిమర్ల మండలం కొత్తపేట పరిధిలోనున్న చిన్న అన్నవరం శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సామూహిక వ్రతాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి సన్నిధిలో నిర్వహించిన వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని, స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్