వంగర మండలం వీవీఆర్ పేటలో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. వీవీఆర్ పేట, రాజుల గుమ్మడ గ్రామాలకు చెందిన పంటల ను గజరాజులు ధ్వంసం చేస్తున్నాయి మొక్కజొన్న, వారి, చెఱకు
పామాయిల్ తోటలను, విద్యుత్ మోటార్లు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని, ఇకనైనా అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి గజరాజుల గుంపును తరలించాలని రైతులు, గ్రామస్థులు శనివారం వాపోతున్నారు.