పీవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలి

53చూసినవారు
పీవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలి
సీతంపేట గిరిజన అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ పీవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని శుక్రవారం గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ వన్ అధికారిని ఐటీడీఏ పీవోగా నియమించడం వల్ల గిరిజన అభివృద్ధి దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్యవేదిక ప్రతినిధులు చౌదరి లక్ష్మీనారాయణ, చిరంజీవులు, మోహన్ పాల్, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you