భామిని మండలం భామినిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయిలో విస్తృత సమావేశం జరిగింది. క్షేత్ర స్థాయి రైతు సంఘాలుగా ఏర్పడి సమిష్టిగా రైతు సమస్యలపై పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. ఈశ్వరయ్య అన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.