ఫ్రీహోల్డ్ ల్యాండ్ రీ సర్వే పక్కాగా నిర్వహించాలి

81చూసినవారు
ఫ్రీహోల్డ్ ల్యాండ్ రీ సర్వే పక్కాగా నిర్వహించాలి
సీతానగరం మండలం అంటిపేట పంచాయతీ పరిధిలో వెన్నెల బుచ్చింపేటలో బుధవారం డి-పట్టా భూముల రీ సర్వేను సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ పరిశీలించారు. ముందుగా ఆయన ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌కు సంబంధించి రికార్డులను, క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ ఫ్రీహౌల్డ్‌ ల్యాండ్‌ రీ సర్వేలో భాగంగా రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కూడా సిబ్బంది చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్