పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తూ రైల్లో మృతి

53చూసినవారు
పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తూ రైల్లో మృతి
పుణ్య క్షేత్రాలకు వెళ్లొస్తూ వ్యక్తి రైల్లో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెందుర్తి నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన రాళ్లపల్లి సత్యనారాయణ (63) తన భార్యతో పుణ్యక్షేత్రాలకు వెళ్లి సమతా ఎక్స్ ప్రెస్లో తిరిగి వస్తుండగా టిట్లాగర్ వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యారు. అక్కడ దిగి చికిత్స అనంతరం నాగావళి ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణం అవుతుండగా పార్వతీపురం సమీపంలో గుండెపోటుతో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్