రాత్రి వెలగాల్సిన విద్యుత్ దీపాలు పగటిపూట సైతం వెలుగుతున్నాయి. దీంతో మున్సిపాలిటీలకు విద్యుత్ బిల్లుల భారం తడిసి మోపెడు అవుతోందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు అన్నారు. గత మూడు రోజులు నుండి పార్వతీపురం మున్సిపాలిటీ 26. వ. వార్డు వేమకోటివారివీధిలో పగలు, రాత్రి వెలుగుతున్నయని శుక్రవారం ఆయన అన్నారు. అధికారులు స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని అన్నారు.