చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని డాక్టర్ సాగర్ వర్మ సూచించారు. కొత్తూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎవరికైనా జ్వరాలు, సీజనల్ వ్యాదులు నమోదు అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తపడాలని సూచించారు.