పొలం పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా పాచిపెంట, కోష్ఠువలస గ్రామాలలో వరి, పత్తి పంటలను బుధవారం పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పాచిపెంట గ్రామంలో అధిక సాంద్రత పద్ధతిలో రైతు దండి రమణమూర్తి వేసిన పత్తి పంటను పరిశీలించారు. పత్తి, వరి పంటల్లో మేలైన వ్యవసాయ పద్ధతులను వివరించారు.