పాచిపెంట మండలం మాతమూరు గ్రామానికి చెందిన ముఖి సూర్యనారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ ఎంపిక పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడుకు సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు, మండల స్థాయి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.