మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. గోపాల్ రావు నాయుడు గురువారం సాయంత్రం తెలిపారు. సాలూరు మండలంలోని గంగన్నదొర వలస, మామిడిపల్లి, మక్కువ మండలంలోని మక్కువ, మావుడి సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్లు, పాచిపెంట మండలంలోని జి ఎన్ పేట రూరల్ ఫీడర్లో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఉదయం 8 నుండి 2 గంటల వరుకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.