సాలూరు: ఉచిత దీపం-2 పథకం ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

56చూసినవారు
మన్యం జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1, 97, 727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్