సంతకవిటి మండలంలో సాయన్నగెడ్డ ఆయకట్టు రైతులకు ప్రతీయేటా కన్నీరు తెప్పిస్తుంది. సాయన్నగెడ్డ కొంతకాలంగా ఆధునీకరణకు నోచుకోక పోవడంతో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రైతుకు శాపముగా మారుతుంది. ఛానల్ రైతుకు సేద్యంలో ప్రతి ఏటా అపార నష్టం కలిగిస్తుంది. శనివారం చూస్తే ఈ ఓపెన్ హెడ్ చానల్లో గుర్రపు డెక్క, పిన్నల కర్ర, రెల్లిగడ్డ నిండిపోయి సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. పిచ్చి మొక్కలతో సాగునీటికి అడ్డంకిగా మారింది