విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆమెకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆమె ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.