తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య శ్రీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న లోతేటి శివశంకర్ ఐఏఎస్ కు పితృ వియోగం కలిగింది. ఎస్. కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఆయన తండ్రి లోతేటి సన్యాసప్పుడు (78) శనివారం సాయంత్రం ధర్మవరంలో కనుమూశారు. సన్యాసప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ సూపర్వైజర్గా ఉద్యోగం చేశారు. ఆయన కుమారుడైన శివశంకర్ ఏపీలో కూడా పలు జిల్లా లో పనిచేసారు.