ఆర్టీసీ లో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

78చూసినవారు
ఆర్టీసీ లో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం డిపో నందు ఆగస్టు 16వ తేదీన ప్రారంభం కానున్న ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు సంబంధించిన 18వ బ్యాచ్ నందు చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరం నిండిన వారు ఈ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులు అన్నారు. మొత్తము శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందని కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకావాలని వివరాలకు 7382924030, 9866649336, 9959225620 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ డిపో మేనేజర్ జె. శ్రీనివాసరావు, డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ డి ఎన్ రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్