రెవిన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా నేడు జిల్లాకు రాక

67చూసినవారు
రెవిన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా నేడు జిల్లాకు రాక
రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. పి. సిసోడియా శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం చేరుకొని తహశీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ రికార్డులు పరిశీలిస్తారు. అనంతరం పలు గ్రామాలు సందర్శించి భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం కలెక్టరు కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్