సింహచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

76చూసినవారు
సింహచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం లో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈనెల 20, 21 తేదీలు అనగా శనివారం, ఆదివారం రోజులలో జరుగుతున్న సింహాచలేశ్వరుని గిరిప్రదక్షిణ కు హాజరవుతున్న ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిపో నుండి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్