ఉపాధ్యాయ వృత్తి మ‌హోన్న‌త‌మైన‌ది: కలెక్టర్

84చూసినవారు
ఉపాధ్యాయ వృత్తి మ‌హోన్న‌త‌మైన‌ది: కలెక్టర్
ఉపాధ్యాయ వృత్తి మ‌హోన్న‌త‌మైన‌ద‌ని జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కొనియాడారు. ఉత్తమ పౌరులను తయారు చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల‌ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. గురుపూజోత్సవ వేడుకలు కలెక్టరేట్లో గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా డాక్టర్ సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. వారికి దుశ్శాలువ‌, జ్ఞాపిక‌, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్