విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పార్సిల్ మరియు కొరియర్ విభాగమును శుక్రవారం విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతా రవికుమార్ ప్రారంభించారు. రవికుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల కోరిక మేరకు పార్సిల్, కొరియర్ బుకింగ్, డెలివరీ కౌంటర్ నందు ఎక్కువ కాలం వేచి ఉండకుండా సమయాన్ని ఆదా చేయుటకు మరియు వేగవంతమైన మెరుగైన సేవలను విస్తృత పరచుకొని తద్వారా కార్గో ఆదాయమును పెంచుకొనూటకు గాను ఈ నూతన కౌంటర్ ను ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.