అనకాపల్లి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్

60చూసినవారు
అనకాపల్లి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
AP: అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 8 మంది చనిపోయారని తెలియడంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్