బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై మరోసారి అరెస్టు వారెంట్ జారీ అయింది. హసీనాతో పాటు ఆమె సోదరి, బ్రిటీష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్, మరో 50 మంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అవినీతి నిరోధక కమిషన్ (ACC) ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ ఛార్జిషీట్లు చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని న్యాయస్థానం ఆదివారం హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.