AP: సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.