AP: వైసీపీ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని ఆయన అన్నారు. యల్లమంద గ్రామస్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగును చూడాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.