రాష్ట్రంలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటోంది. ఏపీలో ఈ పథకం అమలైతే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అమలైతే మహిళలందరూ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. దీంతో తెలంగాణ సరిహద్దు వరకు తెలంగాణ బస్సుల్లో కాకుండా ఏపీ బస్సుల్లోనే మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.